మేము సవర - Memu Savara

Savara Traditional Song

12/11/20241 min read

సొర సొర సొర చిన్న జాతి మనది.

సొర సొర సొర అట్టడుగు తెగ మనది

సొర సొర సొర చిన్న జాతి మనది.

సొర సొర సొర అట్టడుగు తెగ మనది

చిన్న జాతి అయిన సిగ్గు పడవద్దు

అడుగు తెగ అయిన తలదించవద్దు

గుండె మీద చెయ్యేసి చెబుదాం మేము సొర మేము సొర మేము సొర

గుండె మీద చెయ్యేసి చెబుదాం మేము సవర మేము సవర మేము సవర

డబ్బు లేదు, ధనము లేదు

అలా అని సిగ్గు పడదామా

ఇల్లు బాలేదు, వాకీలి బాలేదు

అలా అని సిగ్గు పడదామా

డబ్బు లేదు, ధనము లేదు

అలా అని సిగ్గు పడదామా

ఇల్లు బాలేదు, వాకీలి బాలేదు

అలా అని సిగ్గు పడదామా

మనకి కూడా పొలం పుట్ట అనేదుంది

మనకి కూడా కొండ పిండ కొంచెం ఉంది

సొర సంస్కృతీ మనలో ఉంది

సొర సంప్రదాయం ఎంతో మనలో ఉంది

గుండె మీద చెయ్యేసి చెబుదాం మేము సొర మేము సొర మేము సొర

గుండె మీద చెయ్యేసి చెబుదాం మేము సవర మేము సవర మేము సవర

బుద్దిలేదు, తెలివి లేదు

అలా అని యోచిద్దామా

చదువు లేదు, ఉద్యోగం లేదు

అలా అని యోచిద్దామా

బుద్దిలేదు, తెలివి లేదు

అలా అని యోచిద్దామా

చదువు లేదు, ఉద్యోగం లేదు

అలా అని యోచిద్దామా

మనలో కూడా గొప్ప గొప్ప వాళ్ళున్నారు

మనలో కూడా జ్ఞానవంతులూ ఉన్నారు

మనలో కూడా చదువుకున్న వాళ్ళున్నారు

మనలో కూడా ఉద్యోగస్తులూ ఉన్నారు