పిట్టల వేట - Pittala Veta
12/12/20241 min read
ఓ నేస్తం రా ఒక వస్తువు చూపిస్తాను
ఓ మిత్రమా రా ఒక వస్తువు చూపిస్తాను -2
అక్కడ చూడు అక్కడ చూడు మెట్ట మీద
ఇక్కడ చూడు ఇక్కడ చూడు డొంక లో
మీ తాత రబ్బరు పట్టుకున్నాడోయ్
మీ ముసలమ్మ సంచి పట్టుకున్నదోయ్ -2
మీ తాత పిట్టల కొట్టుట
మీ ముసలమ్మ పిట్టలు ఏరుట
ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే -2
ఓ నేస్తం నీకు పిట్టలు జాడ తెలుసా?
ఓ నేస్తం నీకు పిట్టల వేట తెలుసా ? - 2
మీ తాత దగ్గర నేర్చుకుందా పిట్టల జాడ
మీ ముసలమ్మ దగ్గర నేర్చుకుందాం పిట్టల వేట
నీవేమో పిట్టల కొట్టుట నేనేమో పిట్టలు ఏరట
ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే
నీవేమో పిట్టల కొట్టడం నేనేమో పిట్టలు ఏరుట
ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే
ఓ నేస్తం నీకు రబ్బరు చెయ్యడం తెలుసా ?
ఓ నేస్తం నీకు పిట్టలు దెబ్బ తెలుసా? -2
మీ తాత దగ్గర నేర్చుకుందాం రబ్బరు చెయ్యటం
మీ తాత దగ్గర నేర్చుకుకందాం పిట్టల దెబ్బ
నీవేమో ఒకటి కొట్టు నేనూ కూడా ఒకటి కొడతాను
ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే
నీవు ఒకటి తీసుకెళ్ళు, నేనొకటి తీసుకెళ్తా
ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే