70, 80 90 Yellu
Singer : Sri PD Sudara Rao Garu
12/11/20241 నిమిషాలు చదవండి
పల్లవి:
డెబ్భై ఎనభై తొంబై ఏళ్ళు ఆయాసం దుఖ:మే
మోషే ఆ కాలంలో పని చేసాడుగా
ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా
నీకావయసైనా దేవుని పని నీకుందిగా
అరవై ఏళ్ళకే ప్రభుత్వం వద్దంటుందిగా
ఎనభైయైనా ప్రభువు పని ఉందిగా ॥2॥
డెబ్భై ఎనభై తొంబై ఆయాసమే నూరు నూటిరవై ఇంకా ఆయాసమే
ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే
ఆరోగ్యం లేకున్న చెయ్యాలి దేవుని పనినే
॥ డెబ్బై ఎనభై ॥
1.చరణం:
ఏ జీవైనా ఏ పశువైనా వయసెంతౌతున్న
ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు
పని చెయ్యను అని మొఱ్ఱాయించితే కొరడాతో కొట్టైనా
రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు.
కొన్నాననీ దున్నాలనీ ఏ కష్టం ఎంతున్నా మోయాలనీ
ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా గడ్డేసి గింజేసైనా పని చేయిస్తావు
నీ పనియైతే పశువే చేస్తుందిగా
దేవుని ప్రజలతో శ్రమపడి బ్రతకాలిగా....
॥ డెబ్భై ఎనభై ||
2. చరణం:
బాల్యం అయినా యవ్వనమైనా ఏ దశలోనైనా
నీ చేతికి వచ్చిన ఏ పనియైనా ఇకడే చెయ్యాలి
చనిపోయాకా చేద్దామంటే ఉపాయమే లేదు
నీ శక్తిలోపము లేకుండా నువ్వికడే చేయాలి
మరణించితే విశ్రాంతేగా భూమిమీదకెళ్ళాలంటే మరి ఉండదుగా
ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా లాజరులా యోబులా ఈ శ్రమ భరియించాలి
నూరేళ్ళ అబ్రహామును పిలిచాడుగా ఆ వయస్సులో ఇస్సాకును కన్నాడుగా...
డెబ్బై ఎనభై తొంబై ఏళ్ళు ఆయాసం దుఖ:మే
మోషే ఆ కాలంలో పని చేసాడుగా
ముసలోడని దేవుడు ఎవర్నీ వదలలేదుగా
నీకావయసైనా దేవుని పని నీకుందిగా