Yesu Rakthame

Christian Devotional Song

12/11/20241 నిమిషాలు చదవండి

పల్లవి:

యేసు రక్తమే క్షమించమని మొర పెడుతుంది

హేబేలు రక్తమే శిక్షించమని మొర పెడుతుంది

హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా

ప్రతి దండన చేయాలని కోరుతుంటే

ఎవరి రక్తమో శ్రేష్టమైనది ఎవరి రక్తము క్షమించమన్నది

యేసు రక్తమే ఈ భూమిలో,,,,,,

శత్రువులనైన క్షమించమని అడుగుతుంది

ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది ️

||యేసు రక్తమే️||

1 వ చరణం:

అన్నే నన్ను చంపాడని నిలదీయగా

ఆ దేవుడు వదలలేదుగా

ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయినును వదలలేదుగా

మృతులైన వారే క్షమించలేదు పరదైసుకు వెళ్లిన వదలలేదు

యేసు రక్తమే ఈ భువిలో,,,,,,,,

శత్రువులనైన క్షమించమని అడుగుతుంది ️

||యేసు రక్తమే|| ️

2వ చరణం:

స్తెఫెనను రాళ్లతో కొట్టి చంపుతుండగా

న్యాయం తీర్చాలని అతడ డగలేదుగా

స్తెఫెనను చంపితే సోలే సమ్మతించగా

ఆ యేసే పిలిచే మరి రక్షించెను

యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా

నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్ధించవా

ఆ యేసుని ఈరోజే నువ్వు నమ్మితే

క్షమించమని యేసు ఒక్కడే నేర్పుతాడు

అందుకే సర్వాధికారం ఇచ్చాడు ️

||యేసు రక్తమే️ ||

3వ చరణం:

హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే

క్రొత్త నిబంధన యుద్దకు మీరోచ్చారు

హేబేలు వలె అడగకుండ ఉండాలని

స్టెఫేను క్రొత్త నిబంధనలో నేర్పించాడు

ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి

డెబ్భై ఏళ్లకు పైనే క్షమించాలి

ఈ రక్తమే ప్రతిసారి,,,

నువ్వు తాగుతుంటే క్షమించమని అడుగుతుంది

ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది ️

||యేసు రక్తమే ️||